విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

విద్య

విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం

నూతన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఏఐ పునాది కావాలి క్వింటాల్‌ పత్తి రూ.7,800

కొత్తపల్లి(కరీంనగర్‌): అటవీ జంతువుల నుంచి పంటల రక్షణ పేరుతో విద్యుత్‌ కంచె ఏర్పాటు చేయొద్దని ఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్‌ హెచ్చరించారు. పొలాలు, వ్యవసాయ భూముల చుట్టూ అక్రమంగా విద్యుత్‌ కంచె ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో అనేక చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోలార్‌ ఆధారిత ఫెన్సింగ్‌, గార్డింగ్‌, ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ విద్యుత్‌ కంచె ఉన్నట్లు గమనిస్తే సంబంధిత విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఈ కోరారు.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ప్రస్తుతకాలంలో నూతన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఏఐ పునాది కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నా రు. శాతవాహన యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఎస్‌యూలో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు గురువారంతో ముగి సింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ అనేది యంత్ర అభ్యాస విధానంతో అనుసంధానం చేసుకొని తన పనులను చేసుకుంటుందన్నారు. ఎస్‌యూ వీసీ ఉమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్య, వైద్య, పర్యాటక అన్నిరంగాల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు పెంచవచ్చన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సతీశ్‌కుమార్‌, సురేశ్‌లాల్‌, మహ్మద్‌ జాఫర్‌, కే.శ్రీవాణి, పద్మావతి, వరప్రసాద్‌, సూరేపల్లి సుజాత, మహ్మద్‌ అబ్రారుల్‌ బాకీ, డి.హరికాంత్‌, ఉమేరా తస్లీమ్‌, మునావర్‌, సత్యనారాయణ, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.7,800 పలికింది. గురువారం మార్కెట్‌కు 390 క్వింటాళ్ల పత్తిని రైతులు అ మ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.7,750, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం1
1/2

విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం

విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం2
2/2

విద్యుత్‌ కంచె చట్ట విరుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement