చాలాశ్రమించాం
నోటిఫైడ్ ఏరియా నుంచి పురపాలక సంఘంగా మారిన తర్వాత ఆస్తిపన్ను వసూలు చేయడం కష్టంగా ఉండేది. ఒక్కోఇంటికి వందలసార్లు తిరగాల్సి వచ్చేది. ఇంత శ్రమించినా ఏడాదికి రూ.60లక్షలకు మించి వసూలయ్యేదికాదు. తొలి మున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవతో ఆస్తిపన్ను క్రమంగా రూ.2 కోట్ల వరకు చేరింది. ఇందులోంచే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించేవాళ్లం. ఆర్థిక క్రమశిక్షణ పాటించేవాళ్లం. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసేవాళ్లం. దీంతోనే రామగుండం కార్పొరేషన్ స్థాయికి చేరింది. దీనివెనుక అనేక ఆలోచనలు, అనేక ప్రయాణాలు ఉన్నాయి.
– పిల్లి శివయ్య, అప్పటి ఆర్‌ఐ


