మరో 12 మూగజీవాలు మృత్యువాత
వేములవాడరూరల్: ముక్కినబియ్యం తిన్న గొర్రెలు మూడు రోజుల్లో 80 మృత్యువాత పడ్డాయి. రైస్‌మిల్ యజమాని నిర్లక్ష్యానికి మంగళవారం మరో 12 గొర్రెలు చనిపోయాయి. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మిల్లు యజమానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వరుసగా గొర్రెలు చనిపోతుండడంతో మిల్లు యజమాని గొర్రెల కాపరులతో సయోధ్య కుదుర్చుకునేందుకు పెద్దమనుషులతో చర్చలకు వచ్చినట్లు తెలిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి శివారులో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్, తాండ్య్రాల గ్రామాలకు చెందిన గొర్రెలకాపరులు ఇటీవల మేత కోసం తీసుకొచ్చారు. మర్రిపల్లి శివారులోని మహాలక్ష్మి రైస్‌మిల్లు వద్ద ముక్కినబియ్యాన్ని యజమాని బయట పడేశాడు. వీటిని తిన్న గొర్రెలు గత మూడు రోజులుగా చనిపోతున్నాయి. ఈ విషయంపై పోలీసులు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. ముక్కినబియ్యం తిని గొర్రెలు చనిపోయిన సంఘటనపై మహాలక్ష్మి రైస్‌మిల్లు యజమానులకు మర్రిపల్లి పంచాయతీ కార్యదర్శి నోటీస్‌లు జారీ చేశారు.
మూడు రోజుల్లో 80 గొర్రెలు మృతి


