ఒత్తిడి తగ్గించుకోవాలి
టైంటేబుల్ పెట్టుకొని ప్రతి సబ్జెక్టు కొంత సమయం చదువుకుంటూ పోవాలి. ఏకదాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి. రాత్రంతా చదవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పరీక్షలకు ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. తగినంత నిద్ర పోవాలి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్, డీప్‌ప్రై ఆహారం తీసుకోవద్దు. బయటి ఆహారం పూర్తిగా తగ్గించాలి. అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. చిరుధాన్యాలతో చేసిన పోహా, రాగి దోశ, ఇడ్లీ, ఓట్స్, పండ్ల ముక్కలు, గుడ్లు, పాలు తీసుకోవాలి. – ఉడుగుల సురేశ్,
జనరల్ ఫిజీషియన్, హుజూరాబాద్


