● రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధిచేసే బాధ్యత తమదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం నగరంలోని భాగ్యనగర్‌లో ఏర్పాటు చేసిన 21, 22, 48,49 డివిజన్ల కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. డివిజన్‌లో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేస్తామని, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. కరీంనగర్‌కు ఔటర్‌రింగ్ రోడ్డు, మానేరు రివర్ ఫ్రంట్‌ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డంప్‌యార్డ్‌ను కరీంనగర్, హుజూరాబాద్ మధ్యలో ఏర్పాటు చేసి, ప్రజల సమస్యను తీర్చుతామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే బీఆర్‌ఎస్ నగరానికి ఏం చేయలేదని, ఇప్పుడు గెలిస్తే ఏం చేయగలుగుతుందని ప్రశ్నించారు.
పన్నులు పెంచేది లేదు
కరీంనగర్ కార్పొరేషన్‌కు రూ.1,400 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు సమర్థించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరిట నగరపాలకసంస్థలో చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని, కాని తమ ప్రభుత్వం పన్నులు పెంచే ప్రతిపాదన కూడా చేయలేదన్నారు. పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు పాల్గొన్నారు.


