పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు షురూ | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు షురూ

Feb 8 2026 4:17 AM | Updated on Feb 8 2026 4:17 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు షురూ

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు షురూ

● తొలిరోజు ఓటేసిన 527 మంది ఉద్యోగులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమఓటు హక్కును వినియోగించుకొనేందుకు శనివారం నుంచి మూ డు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. మొదటి రోజు 527మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం డివిజన్లవారీగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిర్ణీత ఫారంలో తమ డ్యూటీ సర్టిఫికెట్‌ను జతపరిచి దరఖాస్తుచేసుకొన్న వారికి అవకాశం కల్పించారు. శనివారం ఉద్యోగులు ఓటు వేసేందుకు కార్యాలయానికి వచ్చినప్పటికి, సమయానికి ఏర్పాట్లు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యం చేస్తున్నారంటూ అధికారులతో వాదనకు దిగారు. 11.30కు ఓటింగ్‌ ప్రారంభించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అధికంగా 12వ డివిజన్‌లో 36, 6,32, 55,66 డివిజన్లలో ఒక్క ఓటు మాత్రమే నమోదైంది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఓటింగ్‌ కొనసాగుతుందని న గరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement