అంతర్జాతీయ వేదికపై ‘జ్యోతిష్మతి’ కీర్తి పతాక
తిమ్మాపూర్: జ్యోతిష్మతి కళాశాల కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేశారు. ఆ కళాశాల విద్యార్థులు దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ సమిట్– రిట్రీట్–2026లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. గతనెల 9 నుంచి 11వ తేదీ వరకు ఇంటర్ కాంటినెంటల్ ఫెస్టివల్ సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతదేశం నుంచి 1,700 టీంలు పోటీపడ్డాయి. అజిత్ షనగొండ, మొహమ్మద్ షోయబ్ బృందం ఫైనల్స్‌కు చేరి కళాశాల కీర్తిని చాటింది. అంతర్జాతీయ స్థాయికి కళాశాల కీర్తిని తీసుకెళ్లిన విద్యార్థులను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు అభినందించారు. సామాజిక ఉద్దేశాలతో నూతన ఆలోచనలను ప్రోత్సహించడం సంస్థ లక్ష్యమన్నారు. సెక్రటరీ జె.సుమిత్‌సాయి ఎంట్రప్రెన్యూర్‌షిప్ నిబద్ధతను హైలైట్ చేశారు. ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.


