రేకుర్తి జాతర ఆదాయం రూ.40.44లక్షలు
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లోని రేకుర్తి సమ్మక్క– సారలమ్మ జాతర ఆదాయం రూ.40,44,292 సమకూరినట్లు ఈవో మారుతి తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ కార్యాలయంలో సహాయ కమిషనర్ సుప్రియ పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో వివరాలు వెల్లడించారు. టెండర్ ద్వారా రూ.11,16,000, టికెట్ల ద్వారా రూ.7,31,580, హుండీల ద్వారా రూ.21,96,712 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 2024 జాతర కంటే ఈసారి రూ.4,52,642 ఆదాయం ఎక్కువగా సమకూరినట్లు వివరించారు. అలాగే 30 గ్రాముల మిశ్రమ బంగారం, 531.5 గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు తెలిపారు.
హౌసింగ్‌బోర్డు జాతర ఆదాయం రూ.4.59 లక్షలు
బొమ్మకల్ రోడ్డులోని హౌసింగ్‌బోర్డు సమక్క– సారలమ్మ జాతర ఆదాయం రూ.4,59,954 సమకూరినట్లు ఈవో వెంకటచారి తెలిపారు. హూండీల ద్వారా రూ.409,234, టికెట్ల ద్వారా రూ.50,720 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.


