మున్సిపల్‌లోనూ కాంగ్రెస్‌దే విజయం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జైత్రయత్ర మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం నగరంలోని వీ పార్క్ హోటల్‌లో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 5వ తేదీన చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు,నామినేటెడ్ చైర్మన్లు హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్‌కు మేయర్‌దక్కకుండా ఉండేందుకు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. ఒకరు బలంగా ఉన్న చోట మరొకరు బలహీనులకు టికెట్ ఇచ్చి సహకరించుకొంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు.


