కబ్జాకోరుల అంతు చూస్తా | - | Sakshi
Sakshi News home page

కబ్జాకోరుల అంతు చూస్తా

Feb 8 2026 4:17 AM | Updated on Feb 8 2026 4:17 AM

కబ్జాకోరుల అంతు చూస్తా

కబ్జాకోరుల అంతు చూస్తా

కబ్జాకోరుల అంతు చూస్తా

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తా

కమలానికి ఓటేయండి

బీజేపీదే మేయర్‌ పీఠం

ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌/కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌లో కబ్జాకోరుల అంతు చూస్తానని.. ప్రజల ఆ స్తులకు రక్షణ కల్పిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఽఅభయమిచ్చారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం ఈసారి బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కబ్జాలకు పాల్పడిన 9మంది కార్పొరేటర్లను అరెస్ట్‌ చేయించి జైళ్లో వేశానన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్‌లోని మల్కాపూర్‌, రేకుర్తి లయోలా కాలేజీ, తీగలగుట్టపల్లి బుట్టిరాజారాంకాలనీ, కొత్తపల్లిలో ఏర్పాటచేసిన కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. 16,17,18,19, 20,25,26,27 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు కటకం లోకేశ్‌, డాక్టర్‌ పుల్లెల ప్రవీణ్‌, చాడ ఆనంద్‌ సతీమ ణి తంబాల నవ్యశ్రీ, గిత్త రాజేంద్రప్రసాద్‌, మూల రుక్మిణి, జాడి బాల్‌రెడ్డి, గుంటి రమ్య, వాసాల రమేశ్‌ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా? లేదా? అనే విషయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సైతం ఈ విషయమై తమ వైఖరి తెలపాలన్నారు. విలీన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement