గెలిపిస్తే అవినీతి రహిత పాలన | - | Sakshi
Sakshi News home page

గెలిపిస్తే అవినీతి రహిత పాలన

Feb 8 2026 4:17 AM | Updated on Feb 8 2026 4:17 AM

గెలిపిస్తే అవినీతి రహిత పాలన

గెలిపిస్తే అవినీతి రహిత పాలన

● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/తిమ్మాపూర్‌: నగరపాలకసంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే అవినీతి లేని పాలనను అందిస్తామని ఐటీ, పరి శ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని రాంనగర్‌, అలుగునూరులో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకొని, కరీంనగర్‌ బల్దియాపై పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే రూపాయి తీసుకోకుండా భవన నిర్మాణ అనుమతులు ఇస్తామన్నారు. త్వరలోనే అలుగునూర్‌ చౌరస్తాను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్రంలోని బీజేపీ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోందని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై కుట్రలు పన్నుతున్నాయని, గతంలో కబ్జాలు, గుండాగిరి స్థితిని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. తమ సర్వేలు 42స్థానాల్లో కాంగ్రెస్‌ విజయాన్ని సూచిస్తున్నాయని, కాంగ్రెస్‌ అభ్యర్థే మేయర్‌గా ఎదుగుతాడని హామీ ఇచ్చారు. 11న జరిగే పోలింగ్‌లో హస్తం చిహ్నానికి ఓటు వేయాలన్నారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఆరెపల్లి మోహన్‌, ఆకా రపు భాస్కర్‌రెడ్డి, కవ్వంపల్లి అనురాధ, మల్లి కార్జున రాజేందర్‌, గోపు మల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement