ఆందోళన ఉప్పు లాంటిది
విద్యార్థులు విజువలైజేషన్ టెక్నిక్ పాటిస్తే మేలు. రాని ప్రశ్నలు వస్తాయేమో, మంచి మార్కులు రావేమో అని భయపడడం వల్లే ఆందోళన. అలా కాకుండా అన్నీ చదివిన ప్రశ్నలే వచ్చినట్లూ, పరీక్ష బాగా రాసినట్లూ, మంచి మార్కులు తెచ్చుకున్నట్లూ... ఊహించుకోవాలి. అప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఆటోమేటిగ్గా ఒత్తిడి తగ్గిపోతుంది. ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు. ఆందోళన ఉప్పు లాంటిదని దానికి దూరంగా ఉండాలి.
– జి.వెంకటరాజం, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చెల్పూర్


