చిన్నారి ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణాలతో చెలగాటం

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

చిన్నారి ప్రాణాలతో చెలగాటం

చిన్నారి ప్రాణాలతో చెలగాటం

● ఊపిరాడకుండ గుడ్డపేగులో చుట్టి యాచన ● వేములవాడలో పట్టుకున్న అధికారులు ● పోలీసులకు ఫిర్యాదు

● ఊపిరాడకుండ గుడ్డపేగులో చుట్టి యాచన ● వేములవాడలో పట్టుకున్న అధికారులు ● పోలీసులకు ఫిర్యాదు

వేములవాడ: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో మూడు నెలల పసికందును గుడ్డలో చుట్టి భక్తుల వద్ద డబ్బులు యాచిస్తున్న ఓ మహిళను వేములవాడలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత వృద్ధులను సంక్షేమ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ తన భుజాన ఓ గుడ్డను వేసుకొని యాచిస్తుండడం గమనించారు. ఆమె వద్దకు వెళ్లి చూడగా ఆ గడ్డులో చిన్నారి ఉండడంతో అవాక్కయ్యారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్‌ ఎల్ల మ్మగుడి వద్ద గుడారాలు వేసుకొని ఉన్న సారవ్వ అనే మహిళ మూడు నెలల క్రితం ఆడ కూతురికి జన్మనిచ్చింది. ఆ మూడు నెలల పాపను పట్టుకొని రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తుల వద్ద యాచిస్తోంది. గుడ్డ పేగులో పసిపాపను చుట్టి యాచిస్తున్న తీరు గమనించిన అధికారులు ఆమెను విచారించారు. మూడు నెలల పాపను ఊపిరి ఆడకుండా గుడ్డలో చుట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఇలాంటి వారు అనేక మంది అడుక్కోవడమే వృత్తిగా బతుకుతున్నారు. ఇప్పటికే చాలా మందిలో మార్పు తీసుకొచ్చిన అధికారులకు వీరిలో మార్పు తీసుకురావడం సాధ్యం కావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement