బీజేపీకి ‘బేతి’ రాజీనామా
కరీంనగర్: బీజేపీలో కార్యకర్తగా వివిధ హోదాల్లో 30ఏళ్ల పాటు పనిచేసిన సీనియర్ నాయకుడు బేతి మహేందర్‌రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు పంపించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తున్న తనకు కాదని ఫిరాయింపుదారులకు బీఫాం ఇవ్వడం తీవ్రంగా కలచివేసిందన్నారు. నగరంలో ఇతర డివిజన్లలో కూడా తనలాంటి పార్టీ విధేయులకు అన్యాయం జరిగినందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహాయ, సహకారాలు అందించిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


