‘వెలిచాల’తో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు | - | Sakshi
Sakshi News home page

‘వెలిచాల’తో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

‘వెలిచాల’తో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు

‘వెలిచాల’తో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు

● అధిష్టానం పిచ్చోడి చేతిలో రాయి పెట్టింది ● మాజీ కార్పొరేటర్లు మెండి దంపతులు ఫైర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా వెలిచాల రాజేందర్‌రావును నియమించి, అధిష్టానం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తోందని మాజీ కార్పొరేటర్లు మెండి శ్రీలత, చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. వెలిచాల ఉంటే కాంగ్రెస్‌కు కరీంనగర్‌లో భవిష్యత్‌ ఉండదన్నారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధిష్టానం కరీంనగర్‌లో పిచ్చోడి చేతిలో రాయి పెట్టిందని, అది ఎటు పోతుందో తెలియదని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతో తమకు పార్టీ టికెట్‌ ఇవ్వకుండా వెలిచాల అన్యాయం చేశాడన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో తమను బ్రతిమాలి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారన్నారు. అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో చాకులాంటి అమ్మాయిలు అని వెలిచాల చేసిన కామెంట్స్‌ తప్పని చెప్పినందుకే తమపై కక్షపెట్టుకొన్నారన్నారు. తమకు టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఉంటున్నానని చెప్పేందుకు డీసీసీ అధ్యక్షుడు సత్యం ఇంటికి వెళ్లామన్నారు. అక్కడికి వచ్చిన వెలిచాలను ఏదైనా పొరపాటుఉంటే క్షమించమని చేతులు పట్టుకొని వేడుకుంటే, తమనే దూషించాడన్నారు. ఒక ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని, దొర అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement