కౌంటర్
పెన్
కొత్త ఆట మొదలైంది
కోరుకోగుర్రాన్ని
ఓటు హక్కు కళ్లాన్ని
ఒడుపుగా పట్టుకుని
ఏమరుపాటుగా ఉంటే
ఏత్తేస్తది ఆ గుర్రం
జాతి గుర్ర రాజాన్ని
జాగ్రత్తగా ఎంచుకో
ఐదేళ్లకు ఒకసారి
ఆటలాడు గుర్రమొద్దు
గడ్డి తినే గుర్రమే
నక్కవినయాలు చూపిస్తది
బోల్తా కొట్టిస్తది..బొందవెట్టిస్తది
తాత్కాలిక సుఖాలకు తలుపులనే తీస్తది
డబ్బులిచ్చి మురిపిస్తది
మాటలతో మరిపిస్తది
లొంగితే నీ బతుకు
ఐదేళ్లు వంగుడే
అభివృద్ధే కావాలంటే
అసలు సిసలు గుర్రాన్ని
ఆలోచించి ఎంచుకో.


