‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

‘సాక్

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు రైతుపై సర్‌‘పంచ్‌’ ● కేసు నమోదు ఉద్యోగుల్లో పోరాట పటిమ తగ్గుతోంది క్వింటాల్‌ పత్తి రూ.7,950

చొప్పదండి: మండలంలోని రాగంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థులకు సోమవారం ‘సాక్షి’ మెటీరియల్‌ పంపిణీ చేశారు. గణితం, ఫిజికల్‌ సైన్స్‌ స్టడీ మెటీరియల్‌ అందించడంపై విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం గంగేశం, ఉపాధ్యాయులు కర్ర వెంకటరాంరెడ్డి, ప్రమీల, రాణి, రాజియొద్దీన్‌, యుగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

చొప్పదండి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5న గుమ్లాపూర్‌ శివారులో నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని గుమ్లాపూర్‌ శివారులో సభా స్థలాన్ని సోమవారం పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలంతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్‌ కొత్తూరి మహేశ్‌, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, నిజానపురం చందు తదితరులు ఉన్నారు.

తిమ్మాపూర్‌: మండలంలోని మొగిలిపాలెం సర్పంచ్‌ తాట్ల తిరుపతిపై కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రామచందర్‌రావు తెలిపిన వివరాలు.. పర్లపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు.. పొలం వద్ద సాగునీటి కాలువ విషయంలో ఇటీవల సదరు సర్పంచ్‌తో స్వల్ప వాగ్వాదం జరిగింది. సోమవారం కరీంనగర్‌లో ఫర్టిలైజర్‌ దుకాణం వద్ద పొలానికి సంబంధించి మందులు కొనుగోలు చేస్తుండగా ఇద్దరికి మాటామాట పెరిగింది. సర్పంచ్‌పై రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్‌ తిరుపతి, రైతుపై చేయి చేసుకున్నాడు. రైతుకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

తిమ్మాపూర్‌: ఉద్యోగులు తమ హక్కులు, సమస్యలపై పోరాడే తత్వం క్రమంగా కోల్పోతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన నీటి పారుదల శాఖ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. 80 ఏళ్లుగా ఉద్యోగుల హక్కుల కోసం టీఎన్జీవో పోరాడుతోందని తెలిపారు. ఏ సమస్యపైనా పిలుపునిస్తే ఉద్యోగులు రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. త్వరలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఏ సమస్య వచ్చినా పోరాటానికి ముందుండాలన్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను అభినందించారు. టీఎన్జీవో కార్యదర్శి సంగెం లక్ష్మ ణరావు, నాయకులు శంకర్‌, నాగేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, పోలు కిషన్‌ పాల్గొన్నారు.

జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌ పత్తి గరిష్ట ధర రూ. 7,950 పలికింది. మార్కెట్‌కు 35 వాహనాల్లో 268 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకవచ్చారు. క్వింటాల్‌కు మోడల్‌ ధర రూ.7,700, కనిష్ట ధర రూ.7,300 చెల్లించారు. క్రయవిక్రయాలను మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ
1
1/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ
2
2/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ
3
3/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement