జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌ | - | Sakshi
Sakshi News home page

జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌

జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌

క్లాక్‌టవర్‌ ప్రత్యేకం

ఒకప్పుడు సమయం తెలిపింది ఈ టవరే

అందమైన రీతిలో కట్టడం నిర్లక్ష్యానికి గురవుతున్న అపురూప నిర్మాణం

జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రం నడిబొడ్డున.. నలువైపులా ఏర్పాటు చేసిన క్లాక్‌టవర్‌ ఈ ప్రాంతానికే ఐకాన్‌గా నిలుస్తోంది. ఇది పట్టణానికే అందం తేవడంతోపాటు గతంలో వచ్చిపోయే వారికి సమయం కూడా తెలిపేది. క్లాక్‌టవర్‌ అంటే ఈ ప్రాంతంలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 1936లో ఈ క్లాక్‌టవర్‌ను చల్‌గల్‌కు చెందిన ధర్మ జలపతిరావు దేశ్‌ముఖ్‌ నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. ఇందులోని గడియారాన్ని జర్మనీ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చారు. నాటి రోజుల్లో స్థానిక ప్రజలకు కలరా వ్యాధి రావడంతో కోలుకున్న సందర్భంగా వ్యాధి నిర్మూలనకు సాక్ష్యంగా ఈక్లాక్‌ టవర్‌ నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.

● ఇందులోని గడియారాన్ని జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు

● ఇది సమయం సూచించడంతోపాటు గంటకుగంటకూ మోగుతుంది

● ఆ శబ్దం చుట్టుపక్కల కొంతదూరం వరకు వినిపిస్తుంది

● మొదట్లో కాషాయం రంగులో ఈ టవర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో సుమారు రూ.10 లక్షలు పెట్టి మరమ్మతు చేయించారు.

● ప్రస్తుతం వైట్‌, బ్లూకలర్‌తో మెరిసిపోతోంది

● 60 అడుగుల ఎత్తుతో అష్టబుజి గోపురం దీని ప్రత్యేకత

● స్తంభానికి ఎత్తైన భాగంలో గోపురం ఉంటుంది.

● నాలుగు వైపులా గడియారం ఉంటుంది

● ఇప్పుడు అది పనిచేయడం లేదు. గతంలో మరమ్మతు చేపట్టినా ఫలితం లేదు.

● క్లాక్‌ టవర్‌ చుట్టూ వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలిశాయి

● ఈ ప్రాంతంలో దొరకని వస్తువంటూ ఉండదు

● జిల్లా కేంద్రంలో నిర్వహించే వినాయకచవితి, దేవీనవరాత్రులు, మొహర్రం, స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా క్లాక్‌టవర్‌ వరకు వచ్చి ప్రదర్శనలు చేపడతారు

● ఉత్సవాల సమయంలో విద్యుత్‌ వెలుగులతో అలంకరిస్తుంటారు

● ఇంత ప్రాచూర్యం పొందిన క్లాక్‌ టవర్‌పై బల్దియా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి

● అధికారులు స్పందించి క్లాక్‌ టవర్‌కు మరమ్మతు చేయడంతోపాటు అభివృద్ధికి కృషి చేయాలని, పర్యాటకులను ఆకట్టుకునేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement