ముచ్చటగా మూడు రూపాలు ! | - | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడు రూపాలు !

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

ముచ్చటగా మూడు రూపాలు !

ముచ్చటగా మూడు రూపాలు !

నగర.. గ్రామపంచాయతీ.. మున్సిపల్‌ కోరుట్ల మున్సిపల్‌ తీరు

కోరుట్ల: ‘కోరుట్ల’..కొన్నాళ్లు నగర పంచాయతీ.. మరికొన్నాళ్లు గ్రామపంచాయతీ.. ప్రస్తుతం మున్సిపాల్టీ ఇలా మూడు మార్పులు పొందింది. 1957లో ఈ ప్రాంతంలో సుమారు 5వేల ఓటర్లు ఉన్న ఉన్న గ్రామంగా కోరుట్ల గుర్తింపు పొందింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నింటికంటే ఎక్కువ ఓటర్లు ఉండడంతో కోరుట్లను నగర పంచాయతీ (బల్దియా)గా మార్చారు. మొదటగా వాసం శంకరయ్య, నీలి కిష్టయ్య, నీలి గంగారాం 20 సంవత్సరాలపాటు నగర పంచాయతీ చైర్మన్‌లుగా వ్యవహరించారు.

గ్రామ పంచాయతీ

ఆ తరువాత కాలంలో 1988 వరకు కోరుట్ల గ్రామపంచాయతీగా కొనసాగింది. ఈ సమయంలో ఉ ప్పులపు భూపతి, నీలి గంగారాం, రహీంపాషాలు సర్పంచులుగా కొనసాగారు. 1988 తరువాత థర్డ్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా మారిన కోరుట్లలో ఏడేళ్లపాటు స్పెషలాఫీసర్ల పాలన కొనసాగింది. స్పెషలాఫీసర్ల కాలంలో కోరుట్ల అభివృద్ధి కుంటుపడింది.

1995లో మున్సిపల్‌ ఎన్నికలు

మొదటిసారి మున్సిపాల్టీకి ప్రత్యక్ష ఎన్నికలు జరగగా అంబల్ల మాధవి మున్సిపల్‌ తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత షేర్‌ నర్సయ్య, ఎంఏ గఫార్‌, శీలం వేణు అవిశ్వాస తీర్మానంతో ఎన్నికై న గడ్డమీద పవన్‌, అన్నం లావణ్య చైర్మన్‌, చైర్‌పర్సన్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం సెకండ్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా మారిన కోరుట్లకు ఇవి ఆరో మున్సిపల్‌ ఎన్నికలు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement