పొత్తు లేకుండానే సత్తా చాటుతాం
‘గంగుల కమలాకర్.. నేను నయాపైసా తీసుకురాలేదని అబద్ధాలాడుతున్నావు.. ఏయే అభివృద్ధి పనులు చేశానో ఆ వివరాలు బుక్‌లెట్‌లో ఉన్నయ్. ఇగ అన్నమాట ప్రకారం.. నువ్వు మూట, ముల్లె సర్దుకుని వెళ్లిపో’.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. –కరీంనగర్ – వివరాలు మెయిన్‌లోu
కరీంనగర్ టౌన్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మేయర్ పీఠం కై వసం చేసుకుంటే ఆ విజయంతో రాష్ట్రం మొత్తం ప్రభావితం అవుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో బీఆర్‌ఎస్ 66 డివిజన్ల ఇన్‌చార్జిలతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డివిజన్ ఇన్‌చార్జీలకు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్‌కు రెండు రూపాయలు కూడా తీసుకురాలేదన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా మేయర్ పీఠం కై వసం చేసుకొని సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, అనిల్‌కుమార్‌గౌడ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పొత్తు లేకుండానే సత్తా చాటుతాం


