బల్దియా నామినేషన్లు 698 | - | Sakshi
Sakshi News home page

బల్దియా నామినేషన్లు 698

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

బల్ది

బల్దియా నామినేషన్లు 698

● అత్యధికంగా 6వ డివిజన్‌ బొమ్మకల్‌లో 22 ● మొదటిరోజు ఒక నామినేషన్‌ ఉపసంహరణ ● నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌

● అత్యధికంగా 6వ డివిజన్‌ బొమ్మకల్‌లో 22 ● మొదటిరోజు ఒక నామినేషన్‌ ఉపసంహరణ

కరీంనగర్‌కార్పొరేషన్‌: పరిశీలన అనంతరం బల్దియాలో నామినేషన్ల లెక్కతేలింది. నగరంలోని 66 డివిజన్‌లకు మొత్తం 698 నామినేషన్‌లు వచ్చాయి. 698 మంది అభ్యర్థులు 1,231 సెట్స్‌ దాఖలు చేశారు. ఆదివారం మొదటి రోజు ఒక అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నాడు.

అధికంగా బొమ్మకల్‌లో..

మొత్తం 1,257 నామినేషన్‌ల సెట్స్‌కు గాను ఒకే అభ్యర్థి, ఒకే పార్టీ పేరిట ఉన్న వేర్వేరు 26 సెట్స్‌ను తొలగించడంతో స్క్రూటినీ అనంతరం 1,231 సెట్స్‌ మిగిలాయి. 66 డివిజన్‌లలో అత్యధికంగా నగరపాలకసంస్థలో తాజాగా విలీనమై, మొదటిసారి బల్దియా ఎన్నికలు జ రుగుతున్న 6వ డివిజన్‌ బొమ్మకల్‌లో 22 నా మినేషన్‌లు దాఖలయ్యాయి. ఇక 32వ డివిజన్‌ హుస్సేనిపుర, 49వ డివిజన్‌ భాగ్యనగర్‌లో అత్యల్పంగా ఐదు నామినేషన్‌లు వచ్చాయి.

ఒకరు ఉపసంహరణ

నామినేషన్‌ల ఉపసంహరణలో మొదటిరోజు నగరంలోని 54వ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సాలెహ్‌బాను తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్‌ల ఉపసంహరణకు మంగళవారం చివరిరోజు.

సీఎం సభాస్థలి పరిశీలన

చొప్పదండి: మండలంలోని గుమ్లాపూర్‌లో ఈ నెల 5న సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సభాస్థలాన్ని చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై నరేశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. వారి వెంట సర్పంచ్‌ లింగాల ఆనంద్‌, ఉప సర్పంచ్‌ ఇనుకొండ రమణారెడ్డి తదితరులున్నారు.

సమర్థవంతంగా పోలింగ్‌ నిర్వహించాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పోలింగ్‌ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. మాస్టర్‌ ట్రైనర్లు సంపత్‌, అమరేందర్‌ శిక్షణ ఇచ్చారు. ఓటర్లను ఎలా గుర్తించాలి, డాక్యుమెంట్స్‌ ఎలా పూరించాలి తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీవోలు, ఏపీవోలు, సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. పోలింగ్‌ స్టేషన్‌ వారీగా ఓటర్ల జాబితా, ఇచ్చిన బ్యాలెట్‌లో పోటీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఓరిజినల్‌ గుర్తింపు కార్డుతో మాత్రమే ఓటుకు అనుమతించాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

వనదేవతల జాతర విజయవంతం

కరీంనగర్‌కల్చరల్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల జరిగిన సమ్మక్క– సారలమ్మ జాతర వైభవంగా ముగిసినట్లు ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ సుప్రియ పేర్కొన్నారు. కరీంనగర్‌లో 16 చోట్ల, పెద్దపల్లి జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో ఒక చోట జాతర జరుగగా, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, హెల్త్‌ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది కృషితో విజయవంతమయ్యాయని తెలిపారు. కాగా, దేవాదాయశాఖ వారు జాతర హుండీలను సమీప పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. సోమవారం నుంచి హుండీలు, కానుకల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్‌లోని రేకుర్తి సమ్మక్క– సారలమ్మ జాతర హుండీలను సోమవారం దేవాదాయ శాఖ కార్యాలయంలో లెక్కించనున్నట్లు ఈవో మారుతి తెలిపారు.

బల్దియా నామినేషన్లు 698
1
1/1

బల్దియా నామినేషన్లు 698

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement