దయచూపని నిర్మలమ్మ | - | Sakshi
Sakshi News home page

దయచూపని నిర్మలమ్మ

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

దయచూప

దయచూపని నిర్మలమ్మ

సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపుపై రాని స్పష్టత ప్రసాద్‌ స్కీంలో ఎంపికవని వేములవాడ, కొండగట్టు రైల్వే కేటాయింపులపై స్పష్టతకు మరింత సమయం జనాభా 5 లక్షలు దాటిన నగరాల్లో కరీంనగర్‌

బడ్జెట్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

కేంద్రప్రభుత్వం ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్‌పర్తి – కరీంనగర్‌, నిజామాబాద్‌ – కరీంనగర్‌ – పెద్దపల్లి డబ్లింగ్‌, పెద్దపల్లి బైపాస్‌ రైల్వేలైన్‌ వర్క్స్‌ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్‌ బుక్‌ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది.

సంక్షేమం, అభివృద్ధి

కరీంనగర్‌: ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్‌ అని కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్‌, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ‘గ్లోబల్‌ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్‌ కీలకపాత్ర వహిస్తుందన్నారు. వికసిత్‌ భారత్‌ రూరల్‌ అజీవికా మిషన్‌ – గ్రామీణ్‌ నిధులు పెంచామని, ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్‌ లక్ష్యమని వివరించారు. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బడ్జెట్‌ అన్నారు.

దయచూపని నిర్మలమ్మ1
1/1

దయచూపని నిర్మలమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement