మూడు కర్తవ్యాలే లక్ష్యంగా బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, ప్రజలందరి ఆకాంక్షల్ని నెరవేర్చడం లాంటి మూడు కర్తవ్యాలే లక్ష్యంగా చారిత్రకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడేలా, మన దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆదాయ పన్ను, వ్యక్తిగత ఆర్థిక అంశాలు, వేతన జీవులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు చేయడం శుభపరిణామం. ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, నిరుద్యోగతను తగ్గించేందుకు ప్రభుత్వం ఐదు ప్రధాన పథకాలను బడ్జెట్‌లో ప్రకటించడం హర్షణీయం.
– గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు


