పోస్టల్‌ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

పోస్ట

పోస్టల్‌ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం

● రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా

పెద్దపల్లి: స్పీడ్‌ పోస్ట్‌, పార్సిల్‌, అంతర్జాతీయ మెయిల్‌ బుకింగ్‌, పిక్‌అప్‌, డెలివరీ సేవలు మరింత విస్తృతం చేసేందుకు భారత పోస్టల్‌ శాఖ శ్రీకారం చుట్టింది. అధునాతన ఏపీటీ 2.0 సాంకేతికత ద్వారా వీటిని అందించేందుకు కొత్త పోస్టల్‌ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి పోస్టల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ శివాజీ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు భారత పోస్టల్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ (indiaport.gov.in) ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. 18ఏళ్ల వయసు పైబడి కనీసం ఇంటర్మీడియట్‌ (డెలివరీ సేవల కోసం పదో తరగతి ఉత్తీర్ణత), ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులన్నారు. కమీషన్‌ ఆధారిత ఆదాయం, ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరించారు. వివరాలకు సమీప పోస్టాఫీస్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ ఆఫీసు కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.

రూ.1.30లక్షలు పట్టివేత

సిరిసిల్ల టౌన్‌ సీఐ కృష్ణ

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎలాంటి పత్రాలు తరలిస్తున్న నగదును ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ బ్రిడ్జి చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. కారు డ్రైవర్‌ మోహిత్‌కుమార్‌ తన కారులో ఎలాంటి పత్రాలు లేని రూ.1.30లక్షలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఆ నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల టౌన్‌ సీఐ కృష్ణ తెలిపారు.

8న వాలీబాల్‌ జట్ల ఎంపిక పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: సిరిసిల్లలోని మినీ స్టేడియంలో ఈ నెల 8న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా స్థాయి యూత్‌ అండర్‌– 21 పురుషులు, మహిళల వాలీబాల్‌ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్‌.వేణుకిషన్‌రావు, గిన్నె లక్ష్మణ్‌ తెలిపారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 16 నుంచి 19 వరకు వేములవాడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయి యూత్‌ వాలీబాల్‌ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో మధ్యాహ్నం 2 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలన్నారు. క్రీడాకారులు 1 జనవరి 2005 తర్వాత పుట్టినవారు అర్హులని తెలిపారు.

గోదావరిలో మృతదేహం

రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామశివారు గోదావరినదిలో సోమవారం పురుషుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 35ఏళ్లు ఉంటుందని భావిస్తున్నామని, జీన్స్‌ప్యాంట్‌, క్రీమ్‌ కలర్‌ షర్ట్‌, లెడ్‌కలర్‌ డ్రాయర్‌, ఎడమ చేతికి ఆకుపచ్చ బట్ట కట్టుకొని ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. బంధువులు గుర్తిస్తే అంతర్గాం ఎస్సై వెంకటస్వామి, సెల్‌నంబరు 99494 93435లో సంప్రదించాలని సూచించారు.

166 మంది బాలలకు విముక్తి

గోదావరిఖని: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. ఈక్రమంలోనే గత జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌–11 విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా 166 మంది బాలలకు విముక్తి కల్పించామని, 20 కేసులు నమోదు చేశామని వివరించారు. తప్పిపోయిన, వదిలేసిన, కిరాణాలు, మెకానిక్‌ షాపులు, హోటళ్లు, కంపెనీల్లో పనిచేస్తున్న, రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సె లింగ్‌ ఇచ్చి అప్పగించామని, కొందరిని చిల్డ్రన్‌ హో మ్‌లకు తరలించామని వివరించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, లేబర్‌, ఎడ్యుకేషన్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌, హెల్త్‌ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. పెద్దపల్లి జిల్లా 30 మంది బాలురు, 18 మంది బాలికలను గుర్తించి 5 కేసులు నమోదు చేసి ఐదుగురి అరెస్ట్‌ చేశామన్నారు. మంచిర్యాల జిల్లాలో 93 బారులు, 25మంది బాలికలను గుర్తించి 15 కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్‌ చేశామని వివరించారు. బాలలను పనిలో పెట్టుకున్నా, బాల కార్మికులుగా పనిచేస్తు న్నా, తప్పిపోయినా.. సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, లేదా డయల్‌ 100 నంబరుకు సమాచారం అందించాలని సీపీ కోరారు.

పోస్టల్‌ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం 1
1/1

పోస్టల్‌ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement