కాంగ్రెస్‌ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

కాంగ్

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

బల్దియాలను కైవసం చేసుకోవాలి

మున్సిపాలిటీలకు నిధులిచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే

గుమ్లాపూర్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

సభతో హస్తంలో నూతనోత్తేజం

తరలివచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/చొప్పదండి:

రీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్‌ప్లాంట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది.

పట్టం కట్టి.. పనులు చేయించుకోండి

సభా వేదికపైకి వచ్చిన సీఎం రేవంత్‌ బీజేపీ– బీఆర్‌ఎస్‌ బంధంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించా రు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778 కోట్లు ఇచ్చామన్నారు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్‌ కార్పొరేషన్‌కు రూ.1,489 కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్‌ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్‌లో రెండో విడు త ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ సంజయ్‌ పట్టణంలోని యావర్‌ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపా రు. రాహుల్‌ గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నా రు. మనల్ని చూసి కేంద్రం కులగణనకు తల వంచిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని, పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేబుల్‌ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్‌ ఫ్రంట్‌, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు.

● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోరడం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణాల్లోని బంధువులకు చెప్పి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

● మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది సీట్లలో ప్రజలు గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తోందన్నారు.

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం, ధర్మపురి లక్ష్మి నృసింహస్వామి ఆలయాలను అభివద్ధి చేయాలని కోరారు. రాబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం కాగానే రూ.240 కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్‌ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులతో పాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు ఇటీవలే టీటీడీ ద్వారా రూ.35 కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కోరారు. విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి1
1/3

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి2
2/3

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి3
3/3

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement