కమనీయం.. తిరుకల్యాణం
జమ్మికుంట: జమ్మికుంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీవెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. వేద పండితులు హరికృష్ణమాచార్యలు, వేణుగోపాలచార్యులు వేద మంత్రోచ్చరణల మధ్య వేడుక కనుల విందుగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ముక్కా జితేందర్‌గుప్తా, పుల్లూరి ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, ఎదులాపురం వెంకటేశ్వర్లు, రావికంటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


