అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయండి

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయండి

అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయండి

● బధిర విద్యార్థులకు సహకరిస్తాం ● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌టౌన్‌/సప్తగిరికాలనీ: అంతర్జాతీయస్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గత నెల 29నుంచి ఈనెల 1 వరకు రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ‘ది సైలెంట్‌ ఒలింపియాడ్‌–2026’ పేరుతో ముంబైలో నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో కరీంనగర్‌ ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొని ఆల్‌ ఇండియా ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచారు. 28 మంది బంగారు, వెండి, రజత పతకాలు సాధించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పమేలా సత్పతి విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయ పోటీల్లోనూ విద్యార్థులు పాల్గొనేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌ జి.కమల ఉదయ కుమారి, ఉపాధ్యాయులు జే.తులసీరామ్‌, కె.శ్రీనివాస్‌, ఎన్‌.సుజాత, బి.అఖిల్‌, ఎం.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రయోగాలు ప్రజల వినియోగం వరకు వెళ్లాలి

విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు సైన్స్‌ ఫెయిర్లకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే వస్తువుల్లాగా మారడం ఎంతో అవసరమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(కుమార్వాడి)లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లాలోని 17, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 8 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ సౌకర్యం ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు తమ ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని కలెక్టర్‌ పమేలా సత్పతి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 35 పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ కోఆర్డినేటర్‌ అశోక్‌ రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌ రెడ్డి, యూనిసెడ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గిరిజాశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement