కంట్రోల్‌ రూం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కంట్రోల్‌ రూం తనిఖీ

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

కంట్రోల్‌ రూం తనిఖీ

కంట్రోల్‌ రూం తనిఖీ

● ఎన్నికల నిబంధన విస్మరించరా.. ● 0878–2997247కు కాల్‌చేయండి

కరీంనగర్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌, మీడి యా సెంటర్‌ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.జితేందర్‌ రెడ్డి తనిఖీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా వచ్చిన వార్త క్లిప్పింగ్‌లను సేకరించి తగు చర్యకై పంపించాలని అన్నారు. కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయాలని, సంబంధిత నోడల్‌ అధికారికి తెలియపరచాలని ఆదేశించారు.

అరచేతికే అస్త్రం

కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికల నిబంధనలను విస్మరించి ప్రచారం చేస్తున్నారా.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం.. ఫోన్‌ చేయండి. ఎన్నికల సక్రమ నిర్వహణకు సహకరించండి. మున్సిపల్‌ ఎన్నికల క్రమంలో ఎన్నికల కోడ్‌ పక్కాగా అమలయ్యేలా ఎన్నికల విభాగం కలెక్టరేట్‌లో ఫిర్యాదుల నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్‌ నంబర్‌ 08782997247. ఏ సమయంలోనైనా ఫోన్‌ చేయొచ్చు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement