కల్లుగీస్తూ గుండెపోటుతో మృతి | - | Sakshi
Sakshi News home page

కల్లుగీస్తూ గుండెపోటుతో మృతి

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

కల్లు

కల్లుగీస్తూ గుండెపోటుతో మృతి

తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం గీతకార్మికుడు కల్లుగీస్తూ తాటిచెట్టుపైనే గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. జిల్లెల్లకు చెందిన సాయిలి కిషన్‌గౌడ్‌(35) తాటిచెట్టుపైకి ఎక్కి కల్లుగీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. చెట్టుపైనే ఉండడంతో కాపాడడానికి వీలులేకుండా పోయింది. దీంతో చెట్టుపైనే మోకుకు వేళాడుతూ ప్రాణాలు వదిలాడు.

వంతెన సైడ్‌వాల్‌ను

ఢీకొన్న బస్సు

జమ్మికుంట : పట్టణంలోని ప్ల్రైఓవర్‌ బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూరాబాద్‌ నుంచి జమ్మికుంటకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ ఆర్టీసీ బస్సు ప్‌లై ఓవర్‌ ఎక్కే క్రమంలో టైర్‌పేలి బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. టౌన్‌ సీఐ రామకృష్ణ, ఎస్సై సతీశ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పొలంలోనే రైతు మృతి

శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో పొలంలోనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కరీంపేట గ్రామానికి చెందిన బొజ్జ సమ్మయ్య (53)కు గ్రామంలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. శుక్రవారం పొలంలో తిరుగుతుండగా గుండెపోటుతో పొలం గట్లపై కుప్పకూలాడు. గమనించిన సమీప రైతులు అక్కడికి వెళ్లేలోపే అప్పటికే మృతిచెందాడు.

కల్లుగీస్తూ    గుండెపోటుతో మృతి1
1/2

కల్లుగీస్తూ గుండెపోటుతో మృతి

కల్లుగీస్తూ    గుండెపోటుతో మృతి2
2/2

కల్లుగీస్తూ గుండెపోటుతో మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement