ముస్లింలు ఎటు?
తమ వైపే ఉన్నారంటున్న కాంగ్రెస్ మద్దతు మాకే అంటున్న బీఆర్‌ఎస్ జనాభాలో 20శాతం ఉన్నా దక్కని ప్రాధాన్యం ముస్లింలకు తాము వ్యతిరేకం కాదంటున్న బీజేపీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ●:
కరీంనగర్ కార్పొరేషన్‌లో ముస్లింల ఓటు బ్యాంకు కీలకంగా మారింది. మొత్తం జనాభాలో 20శాతం ఓట్లు ఉన్నా రాజకీయ గుర్తింపు, వసతుల కల్పనలో ప్రాధాన్యం దక్కలేదన్న విమర్శలున్నాయి. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన అభివృద్ధి జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సదుపాయాల కల్పనలోనూ గత పాలకవర్గాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా తమ ప్రాంతాల్లో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ మొదటి నుంచి బల్దియాలో ముస్లింల గొంతుకగా నిలిచిందని, వి గిలిన సమస్యలను తామే పరిష్కరిస్తామని కాంగ్రెస్ అంటోంది. ముస్లింలు తమ వైపే ఉన్నారని, అత్యధిక సీట్లు గెలచుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ నేతలు తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని అంటుండగా.. వారి మద్దతు తమకే ఉందని మజ్లిస్ చెబుతోంది.
సమస్యలివే
షాదీఖానాలో వసతులు, రిపేర్లు లేక బోసిపోయాయి. కొన్ని ప్రదేశాలలో భూమి కేటాయించినా నిధులు ఇవ్వక నిర్మాణాలు నిలిచిపోయాయి. స్మార్ట్‌సిటీ బోర్డుల్లో, ఇతర ప్రదేశాలలో ఉర్దూ ప్రాఽ దాన్యం దక్కలేదని అసంతృప్తి ఉంది. నగరంలో బల్దియా తీర్మానాలు చేసినా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రూ.5 భోజన క్యాంటీన్లు ఏర్పాటు చేయలేదు. ముస్లింలు మరణిస్తే అంతిమ యాత్ర పథకం కింద బల్దియా నుంచి రూ.10,000 వసూలు చేసి సగానికిపైగా చేతివాటం ప్రదర్శిస్తున్నా అడిగే నాథు డే లేడు. బల్దియా పరిధిలో ఉన్నవక్ఫ్ ఆస్తులను అద్దెకిచ్చి మార్కెట్ రేట్ ప్రకారం కిరాయి వసూలు చేసేలా చూడాలి. మైనారిటీలలో వీధి వ్యాపారులు అధికంగా ఉన్నారు. వారికి చట్ట ప్రకారం సర్టిఫికెట్ ఆఫ్ వెండింగ్ ఇవ్వాలి. కార్ఖానగడ్డ ప్రాంతంలో దాదాపుగా 20 వేల జనాభా ఉన్నా ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లేదు. మహిళా సంఘాల రుణా ల జారీ పేరిట వెలుగుచూస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయడం లేదు. మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో అంగన్వాడి సెంటర్లు, ఉర్దూ బోధన లేక ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చిన్నారులు దూరమవుతున్నారు. మైనార్టీ ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు, మరుగుదొడ్ల సదుపాయాలు సరిగా లేవు, ఆయా ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు, ఈఎస్‌ఐ ఆసుపత్రులు లేవు. డబుల్ బెడ్రూం కేటాయింపులో కాలయాపనతో అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
కరీంనగర్ బల్దియాలో కాంగ్రెస్– ముస్లిం మైనార్టీలకు విడదీయరాని బంధం ఉంది. గత పాలకవర్గాలు వారిని విస్మరించాయి. స్మార్ట్‌సిటీ పేరిట నిధులు దోచుకున్నారు. ముస్లింలను విస్మరించారు. కొన్ని ప్రాంతాల్లోనే ఐలాండ్‌లు నిర్మిస్తే అది స్మార్ట్‌సిటీ కాదు. కశ్మీర్‌గడ్డ, రజ్వీచమాన్ తదితర ప్రాంతాల్లో ప్రజల జీవితాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. పేద ముస్లింల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో డ్రెయిన్, రోడ్లు ఇతర సదుపాయాలకు పెద్దపీట వేస్తాం.
– వెలిచాల రాజేందర్ రావు,
కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి
ముస్లింలు ఎటు?


