మాకు ప్రగతి కావాలి.. వాళ్లకు మీ జాగా కావాలి | - | Sakshi
Sakshi News home page

మాకు ప్రగతి కావాలి.. వాళ్లకు మీ జాగా కావాలి

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

మాకు

మాకు ప్రగతి కావాలి.. వాళ్లకు మీ జాగా కావాలి

● కరీంనగర్‌ అభివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చిన ● మేయర్‌ పీఠాన్ని అప్పగిస్తే డంప్‌యార్డ్‌ సమస్య పరిష్కరిస్తా ● ప్రచారసభల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌: మాకు నగర ప్రగతి కావాలి. వాళ్లకు మీ జాగాలు కావాలి. ఆలోచించి ఓటేయండంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కోతిరాంపూర్‌చౌరస్తా, పాత లేబర్‌ అడ్డా సమీపంలో నిర్వహించిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. మాజీ మేయర్‌ సునీల్‌ రావు, 9, 39, 40, 62, 63, 64 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ, పెద్దపల్లి శ్రీలేఖ, దేశ శిల్పా వేదం, గాదె శ్రీలేఖ పక్షాన ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ అభివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చానని, ఈ వివరాలన్నీ బుక్‌ లెట్‌ప్రింట్‌ చేసి ఇంటింటికీ పంపిస్తున్నానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నేతలు కరీంనగర్‌ చుట్టుపక్కల జాగాలు కబ్జా చేశారని, సిగ్గు లేకుండా వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ గురించి చెప్పుకోవడమే దండుగ అన్నారు. అది కాంగ్రెస్‌ కాదు...‘ఖాన్‌’ గ్రేస్‌ అని ఎద్దేవా చేశారు. ఏ సర్వే చూసినా కరీంనగర్‌లో వార్‌వన్‌ సైడ్‌ అని సర్వే నివేదికలన్నీ చెబుతున్నాయన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే నగరంలోని డంప్‌యార్డు సమస్య పరిష్కరిస్తామన్నారు.

మాకు ప్రగతి కావాలి.. వాళ్లకు మీ జాగా కావాలి1
1/1

మాకు ప్రగతి కావాలి.. వాళ్లకు మీ జాగా కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement