మత్తు రహిత సమాజానికి కృషి చేయాలి
కరీంనగర్‌కల్చరల్: మత్తు రహిత సమాజాన్ని సాధించేందుకు కవి, రచయితలు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీనియర్ కవి, గాయకుడు నడిమెట్ల రామయ్య అన్నారు. సోమవారం రాత్రి తీగలగుట్టపల్లి టీచర్‌కాలనీలో సుంకె రాజు నివాసంలో జరిగిన 154వ ఎన్నీల ముచ్చట్లలో మాట్లాడారు. డ్రగ్స్ మాఫియా చేతిలో బలైపోయిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం నిర్వాహకులు కవితాపఠనం కార్యక్రమాన్ని కొనసాగించారు. సమకాలిన అంశాలపై కవులు కవిత్వం చదివి వినిపించారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు సీవీ కుమార్, దామరకుంట శంకరయ్య కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కవులు బాలసాని కొమురయ్య, గుండు రమణయ్య, విలాసాగరం రవీందర్, నెరువట్ల చైతన్య, జనగాని యుగంధర్, రావుల శ్రీనివాసాచారి, బొల్లం బాలకృష్ణ వెంకటేశ్, ఉపేందర్ తదితరులు కవిత్వం వినిపించారు.
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ సంతోష్‌నగర్, చైతన్యపురి, మహాశక్తి ఆలయ ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. సంతోష్‌నగర్, సంతోషిమాత ఆలయం, మహాశక్తి ఆలయం, బాలాజీ సూపర్‌మార్కెట్, భాగ్యనగర్, జ్యోతినగర్, గీతాభవన్ వెనక ప్రాంతం, కార్పెంటర్స్ సొసైటీ, హనుమాన్ ఆలయం, కొత్త లేబర్‌అడ్డా, సాయిబాబా ఆలయం, సెయింట్ జాన్స్ స్కూల్, చైతన్యపురి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.


