40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల | - | Sakshi
Sakshi News home page

40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల

40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల

40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి (హెచ్‌) వార్డు సభ్యుడిగా.. ఉపసర్పంచ్‌గా.. సర్పంచ్‌గా.. ఎంపీటీసీగా.. కరీంనగర్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా.. కౌన్సిలర్‌గా.. ఓటమి ఎరగని నేతగా 40ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కొత్తపల్లికి చెందిన వాసాల రమేశ్‌. కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా, కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా (1998–2001), కరీంనగర్‌ నియోజకవర్గ ఏసీడీపీ సభ్యుడిగా సేవలందించారు. గ్యాడ్యుయేషన్‌ పూర్తి చేసిన రమేశ్‌ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 18వ డివిజన్‌ (కొత్తపల్లి) అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement