హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

కరీంనగర్‌: మహిళలను వేధిస్తున్న కేన్సర్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ప్రారంభమైంది. ఆర్‌ఎంవో నవీన వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కేన్సర్‌ను నిరోధించాలనే లక్ష్యంతో ప్ర భుత్వాలు యుక్త వయస్సు (14–15) గల బాలికలకు ఈ టీకాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. జీజీహెచ్‌తో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట ఆస్పత్రుల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించామని డీఎంహెచ్‌వో తెలిపారు.

జీఐఎస్‌ ద్వారా విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

కొత్తపల్లి(కరీంనగర్‌): జీఐఎస్‌(జియోగ్రఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం) ద్వారా విద్యుత్‌ సమస్యలు సత్వ రం పరిష్కరించనున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీఐఎస్‌ అసెట్‌ మ్యాపింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ ప్రక్రియలో అన్ని 33 కేవీ లైన్లలోని 90 ఫీడర్ల పనులు పూర్తిచేసినట్లు తెలిపా రు. 11 కేవీ లైన్లలోని 317 ఫీడర్లకు యూనిక్‌ పోల్‌నంబర్‌ పెయింటింగ్‌ చేపట్టామన్నారు. ఈ ప్రక్రియతో పోల్‌ల వారీగా పెట్రోలింగ్‌, నిర్వహణ పనులు సమర్థవంతంగా ట్రాక్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే ఆ పోల్‌ నంబర్‌ ఆధారంగా లొకేషన్‌ మ్యాపింగ్‌ తెలుసుకొని పరిష్కరించవచ్చునన్నారు. త్వరితగతిన స్పందించడం ద్వారా విద్యుత్‌ అంతరాయాలు తగ్గించవచ్చన్నారు.

వంటగ్యాస్‌ పెంపుపై నిరసన

కరీంనగర్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణచౌక్‌ వద్ద నిరసన చేపట్టారు. పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరగకుండానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మో పడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. గ్యాస్‌ ధర పెంపుతో జిల్లా ప్రజలపై నెలకు అదనంగా రూ.9 కోట్ల భారం పడుతోందన్నారు. 2014కు ముందు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.500 లోపు ఉంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన 12ఏళ్ల కాలంలో వెయ్యికి చేరుకుందన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేశ్‌, డి.నరేశ్‌పటేల్‌, తిప్పారపు సురేశ్‌, గజ్జల శ్రీకాంత్‌, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, రాయికంటి శ్రీనివాస్‌, రాజయ్య పాల్గొన్నారు.

నల్లవెంకయ్యపల్లెలో ‘జల అర్బన్‌’

శంకరపట్నం: మండలంలోని నల్లవెంకయ్యపల్లె గ్రామంలో ఆదివారం జల అర్బన్‌ కార్యక్రమం నిర్వహించారు. మిషన్‌ భగీరథ నీటి ప్రాముఖ్యతపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. నూతన గ్రామంగా ఏర్పాటైన నల్ల వెంకయ్యపల్లెను ప్రభుత్వం జల అర్బన్‌ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. మిషన్‌ భగీరథ రికార్డులను గ్రామపంచాయతీకి అందించారు. జలజీవన్‌ పథకంలో అందిస్తున్న మిషన్‌ భగీ రథ నీటిని వినియోగించాలని డీపీవో జగదీశ్వ ర్‌ సూచించారు. సర్పంచ్‌ నాగలక్ష్మి, ఎస్‌ఈ రాములు, ఎంపీడీవో కృష్ణప్రసాద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement