‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

మార్చి 14నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు హాజరు కానున్న 13,157 మంది విద్యార్థులు జిల్లాకు చేరిన ప్రశ్నాపత్రాలు, ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు

కరీంనగర్‌టౌన్‌: పదోతరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14 నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరుకోగా, కలెక్టరేట్‌లోని ట్రెజరీ విభాగంలో భద్రపరిచారు. అన్నిశాఖల అధికారులతో పలు దఫా లుగా కలెక్టర్‌ సమావేశం నిర్వహించి, దిశనిర్దేశం చేశారు. విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. హెడ్‌ మాస్టార్ల సంతకంతో పని లేకుండా డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షకు హాజరు కావచ్చు.

జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు

పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి వచ్చేనెల 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నా యి. జిల్లావ్యాప్తంగా 73 కేంద్రాల్లో రెగ్యులర్‌ వి ద్యార్థులు 1,3157 మంది, ప్రైవేట్‌గా ఏడుగురు పరీక్షలు రాయనున్నారు. 73మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 73 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికా రులు, ఇద్దరు అదనపు డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 695 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష హాలులో వెలుతురు, తాగునీటి వసతి, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి రోజు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పోలీస్‌స్టేషన్‌ నుంచి పరీక్ష సమయాని కన్నా ముందుగా తీసుకువచ్చే విధంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు (సీఎస్‌), డిపార్ట్‌మెంట్‌ అధికారులు (డీవో)లకు ఆదేశాలు జారీ చేశారు. సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష పేపర్ల సీల్‌ ఓపెన్‌ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయి వాటిని సీల్‌ చేసేంత వరకురికార్డు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement