ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో మంగళవారం బైక్, కారు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రాగుల యాదగిరి బుధవారం మృతి చెందాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం చిన్నబోనాలకు చెందిన రాగుల యాదగిరి–శంకరమ్మ దంపతులు టీవీఎస్ ఎక్సెల్‌పై ఎల్లారెడ్డిపేట దుమాలకు మంగళవారం వచ్చి తిరిగి వెళ్తుండగా కామారెడ్డి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ద్విచక్రవాహనం కాలిపోయింది. క్షతగాత్రులను 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.
బల్దియా.. ఇదేం‘దయ’
సిరిసిల్లఅర్బన్: పట్టణ పరిధిలోని పదోవార్డు చిన్నబోనాలకు చెందిన రేగుల యాదగిరి మృతదేహన్ని గురువారం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం సంబంధిత మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లినట్లు స్థానిక కౌన్సిలర్ బొల్గం వైష్ణవి తెలిపారు. ఇప్పటికై నా విలీన గ్రామాల్లో ప్రత్యేక వైకుంఠరథం ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీకి పన్నులు చెల్లించినా విలీన గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రూ.101కే దహన సంస్కారాలు నిర్వహించేలా మున్సిపల్ అధికారులు విలీన గ్రామాల్లోనూ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


