సామాజిక సేవకు లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవకు లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

సామాజ

సామాజిక సేవకు లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం

● మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటికే రామయ్య కల్యాణ తలంబ్రాలు వేసవిలో విద్యుత్‌ సమస్యలు ఉండొద్దు

● మంత్రి పొన్నం ప్రభాకర్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): సామాజిక సేవా కార్యక్రమాలకు లయన్స్‌ క్లబ్‌ నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ శివారు రేకుర్తిలోని డాక్టర్‌ మాడేకర్‌ లయన్స్‌ క్లబ్‌ ఉదార కంటి ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన బొమ్మ వెంకటేశ్వర్లు బ్లాక్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మా ట్లాడుతూ దూరదృష్టితో ఆలోచించిన బొమ్మ వెంకన్న ఆనాడు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రేకుర్తిలో కంటి ఆస్పత్రి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు 8.52 లక్షల మందికి ఓపీ చికిత్స, 1,21,000 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరి గిందన్నారు. లయన్స్‌ క్లబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హౌజ్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, కార్పొరేటర్లు పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్‌, వరా ల నర్సింగం, మల్లికార్జున రాజేందర్‌, గుమ్మడి రాజ్‌కుమార్‌, నలువాల రవీందర్‌, కంటి ఆసుపత్రి చైర్మన్‌ కె.వేణుమూర్తి, ప్రతినిధులు కోదండరాం, భద్రేశం, చంద్రప్రకాశ్‌, సురేశ్‌, ప్రకాశ్‌ హొల్లా, బొమ్మ పవన్‌కుమార్‌, కోల అన్నారెడ్డి, టి.మురళీధర్‌రావు, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.పద్మాకర్‌ రెడ్డి, సత్యంగౌడ్‌ పాల్గొన్నారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ద్వారా భక్తులకు ఇంటివద్దకే అందించనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.రాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పో స్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సెంట ర్లలో రూ.151 చెల్లించి మార్చి 31లోగా బుక్‌ చేసుకోవాలని సూచించారు. వివరాలకు కరీంనగర్‌ 9154298561, 9154298581, హుజూ రాబాద్‌, హుస్నాబాద్‌ 9154298559, సిరిసిల్ల, వేములవాడ 9154298576, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి 7780250439, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని 9949407275 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): వేసవికాలంలో విద్యుత్‌ సమస్యల్లేకుండా చర్యలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) టి.మధుసూదన్‌ సూచించారు. కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ చాంబర్‌లో శుక్రవారం ఎన్‌పీడీసీఎల్‌, ట్రాన్స్‌కో అధికారులతో సమీక్షించారు. వేసవి ప్రణాళిక సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమున్న చోట పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీ పెంపు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లలో ఓవర్‌ లోడ్‌ గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 33 కె.వీ, 11 కె.వీ లైన్లు ఓవర్‌ లోడ్‌ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం, గురువారం, శనివారం ప్రజాబాట నిర్వహించి అదేరోజు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆపరేషన్స్‌ సీఈ బి.అశోక్‌, ట్రాన్స్‌కో సీఈ విజయ్‌ కుమార్‌ పాపారావు, ఎస్‌ఈ వి.గంగాధర్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎన్‌.శ్రీనివాస్‌, డీఈలు ఉపేందర్‌, రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

సామాజిక సేవకు  లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం1
1/2

సామాజిక సేవకు లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం

సామాజిక సేవకు  లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం2
2/2

సామాజిక సేవకు లయన్స్‌ క్లబ్‌ నిదర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement