రాజగోపురం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాజగోపురం ప్రారంభం

Mar 2 2026 7:33 AM | Updated on Mar 2 2026 7:33 AM

రాజగో

రాజగోపురం ప్రారంభం

తిమ్మాపూర్‌: మండలంలోని నల్లగొండ శ్రీ సీ తారామ లక్ష్మీనరసింహాస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆదివారం సందర్శించా రు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, నూతనంగా నిర్మించిన రాజగోపురం ప్రారంభించా రు. భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ఆల య కమిటీ చైర్మన్‌, ఈవో పాల్గొన్నారు.

ఆరోగ్యంపై చైతన్య ర్యాలీ

కరీంనగర్‌: ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించేందుకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జనరల్‌ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆది వారం ‘ఈరోజు పరుగు.. రేపటి ఆరోగ్యానికి భరోసా– పరిగెత్తడం మొదలుపెట్టు.. జబ్బులను వదిలేయ్‌’ అనే నినాదంతో హెల్త్‌ రన్‌ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణం నుంచి గీతాభవన్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. 235 మంది వైద్య విద్యార్థులు, 42 మంది వైద్యులు పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీన ఆధ్వర్యంలో గీతాభవన్‌ సర్కిల్‌ వద్ద వైద్య విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ నాటిక ప్రదర్శించారు. మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ వంశీ చేతన కేన్సర్‌ నిర్ధారణ, జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతపై సూ చనలు చేశారు. డాక్టర్లు శిరీష, హరికృష్ణరెడ్డి, నరేందర్‌, ప్రసాద్‌ స్వామి, రవి ప్రవీణ్‌రెడ్డి, రణధీర్‌, సతీశ్‌, మ హేందర్‌, సుహేళ, గంగాధర్‌, జాదవ్‌ పాల్గొన్నారు.

విద్యా కమిషన్‌ సిఫారసు వెనక్కి తీసుకోవాలి

కరీంనగర్‌టౌన్‌: రాష్ట్ర విద్యా కమిషన్‌ సిఫారసు ను ఉపాధ్యాయ సంఘం నేతలు ఖండించారు. కమిషన్‌ సూచించిన సిఫారసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన ఉమ్మడి సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. జాతీయ విద్యా విధానం 2020ని లోతుగా అధ్యయనం చేసి విద్యారంగం, ఉపాధ్యాయ విద్యార్థుల విషయంలో సానుకూల దృక్పథం ఏర్పరచుకొని భవిష్యత్తుకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చందూరి రాజిరెడ్డి, తపస్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు, కట్ట వేణుగోపాల్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతిరావు, శ్యాంకుమార్‌, దాసరి శ్రీధర్‌, ఎస్‌జీటీయూ జిల్లా అధ్యక్షుడు యు.విజయేందర్‌రెడ్డి, టీటీ యూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఉన్నారు.

ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు

కరీంనగర్‌టౌన్‌/విద్యానగర్‌: కరీంనగర్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ కోసం ఆదివారం వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరయ్యా రని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.నాగైలేశ్వర్‌ తెలిపారు. ఫలితాలను డైరెక్టర్‌ హైదరాబాద్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తామని, ఎంపికై న అభ్యర్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందుతుందని అన్నారు. ఇతర వివరాల కోసం కరీంనగర్‌ జిల్లాకేంద్రం డైరెక్టర్‌ బండ శ్రీనివాస్‌ 98852 18053ను సంప్రదించవచ్చని సూచించారు.

రాజగోపురం ప్రారంభం1
1/3

రాజగోపురం ప్రారంభం

రాజగోపురం ప్రారంభం2
2/3

రాజగోపురం ప్రారంభం

రాజగోపురం ప్రారంభం3
3/3

రాజగోపురం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement