సూర్యుడు సుర్రు..
వేసవి బిజినెస్ షురూ..
వేసవికాలం ప్రారంభం అవుతోంది. ఎండలు ముదురుతున్నాయి. దీంతో వ్యాపారులు సీజనల్ వ్యాపారం కోసం ముందుచూపుతో ఆలోచిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా అమ్ముడుపోయే కొబ్బరి బొండాలు, ఖర్బూజా, పుచ్చకాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రా ష్ట్రాల నుంచి లారీల్లో స్టాక్ వస్తుండగా.. గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఈ సారి ఎండలు ఎక్కువ ఉండే అవకాశం ఉండడంతో వ్యాపారం బాగా జరుగుతుందని ఆ శాభావం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని టవర్‌సర్కిల్, తెలంగాణ చౌక్, మంకమ్మతోట, ఎస్సారార్ కళాశాలతో పాటు ప్రధాన కూడళ్లలో విక్రయించేందుకు వ్యాపారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
సూర్యుడు సుర్రు..
సూర్యుడు సుర్రు..
సూర్యుడు సుర్రు..


