కలెక్టర్‌గా చిత్ర మిశ్రా | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

Feb 27 2026 7:38 AM | Updated on Feb 27 2026 7:38 AM

కలెక్

కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

● నేడు బాధ్యతల స్వీకరణ ● కార్మికశాఖ కమిషనర్‌గా పమేలా సత్పతి బదిలీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

జిల్లా కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45మంది ఐఏ ఎస్‌లు బదిలీ కాగా జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన పమేలా సత్పతిని కార్మికశాఖ కమిషనర్‌గా స్థాన చలనం కల్పించారు. నూతన కలెక్టర్‌ చిత్ర మిశ్రా 2019 బ్యాచ్‌ కాగా తెలంగాణ క్యాడర్‌ కావ డం ఆహ్వానించదగ్గ పరిణామం. సంగారెడ్డి స్వస్థలం కాగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌లో 2018 లో ఆల్‌ ఇండియాలో 20వ ర్యాంక్‌ సాధించారు. తొలుత నాగర్‌ కర్నూలు ట్రైనీ కలెక్టర్‌గా పని చేశారు. తరువాత నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌గా, అక్కడే మున్సిపల్‌ కమిషనర్‌గా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించగా.. తాజాగా కరీంనగర్‌ కలెక్టర్‌గా నియామకం అయ్యారు.

పరిపాలనలో పమేలా తనదైన ముద్ర

2023 అక్టోబర్‌ 30న కలెక్టర్‌గా పమేలా సత్పతి బాధ్యతలు చేపట్టి పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ప్రశంసలు పొందారు. అంగన్‌వాడీలో శుక్రవారం సభ నిర్వహించి ప్రత్యేక మన్ననలు పొందారు. ఇటుక బట్టిల వద్ద విద్యనందించేలా కృషి చేశారు. పిల్లల భవితను కొనియాడుతూ ‘ఓ చిన్ని పిచ్చుక’ అంటూ స్వయంగా ఆలపించిన గీతం ప్రత్యేకంగా నిలిచారు. అలాగే ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ అంటూ బధిరుల కోసం పాడిన పాట ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆదర్శంగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రదర్శన ఇచ్చారు.

పమేలా సత్పతి

చిత్ర మిశ్రా

షరా ‘మామూలే’..

కలెక్టర్‌గా చిత్ర మిశ్రా1
1/1

కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement