తిమ్మాపూర్: మండలం నల్లగొండలో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు నేత్రపర్వంగా సాగింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. రథంపై లక్ష్మీసమేత నసింహస్వామిని దర్శించుకుని పులకించిపోయారు. సాయంత్రం స్వామివారిని రథం నుంచి గర్భగుడికి తీసుకొచ్చారు. భక్తులకు ఆసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ బండారు లక్ష్మణ్, ఈవో అనిల్ తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి.


