సెమినార్‌ కరపత్రం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సెమినార్‌ కరపత్రం ఆవిష్కరణ

Mar 7 2026 7:28 AM | Updated on Mar 7 2026 7:28 AM

కరీంనగర్‌ సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్ర భుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో జాతీయస్థాయి సెమినార్‌ నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని కళాశాల ఆవరణలో, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కడారు సురేందర్‌ రెడ్డి, సెమినార్‌ సమన్వయకర్త డాక్టర్‌ కిరణ్మయి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.రాజయ్య, పరీక్షల ని యంత్రణ అధికారి పి.శ్రీనివాస్‌, స్టాప్‌ క్లబ్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, జంతుశాస్త్ర అధ్యాపకుడు రవీందర్‌రావు, సమత పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,450

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.7,450 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 16 వాహనాల్లో 112 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని,ఆదివారాలు మార్కెట్‌కు సాధారణ సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో శనివా రం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్‌ ఫీడర్‌ పరిధిలోని సాయిబాబా ఆలయం, అంజనాద్రి గుట్ట, పొన్నం కనకయ్య టీ స్టాల్‌, రామచంద్రాపూర్‌, ఎర్రగుట్ట ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు

హుజూరాబాద్‌: గర్భాశయ కేన్సర్‌ను నివారించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిని డాక్టర్‌ సాజిదా అన్సారి సూచించారు. హుజూ రాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం డిప్యూ టీ డీఎంహెచ్‌వో చందు, సూపరింటెండెంట్‌ నల్ల నారాయణరెడ్డితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. హుజురాబాద్‌ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంటలో వాక్సినేషన్‌ కార్యక్రమం ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ 14ఏళ్లు నిండిన బాలికలకు మాత్రమే వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 9,936 మంది 14ఏళ్లు నిండినవారు ఉన్నారని, వారిలో 2,313మంది కి వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే బాలికలకు ఏరియా ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో రెండు గదులు కేటాయించడం జరిగిందని అన్నారు. వైద్యులు తులసీ దాస్‌, పి.శ్రీకాంత్‌ రెడ్డి, సదానందం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement