ఆర్టీసీ బస్సు, కారు ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, కారు ఢీ

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

ఆర్టీ

ఆర్టీసీ బస్సు, కారు ఢీ

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని గూడెం శివారులోని మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కరీంనగర్‌కు చెందిన లక్కిరెడ్డి విజయ, తాటిపల్లి లహరిక కారులో ముస్తాబాద్‌కు వచ్చి శుక్రవారం తిరిగి వెళ్తున్నారు. గూడెం పెట్రోల్‌బంకు మూలమలుపు వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈసంఘటనలో రిటైర్డు టీచర్‌ విజయ, లహరిక, కారు డ్రైవర్‌ సంతోష్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఏఎస్సై అశోక్‌కుమార్‌ పరిశీలించి, ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టారు.

అన్నదమ్ముల మధ్య గొడవ.. ఇద్దరిపై కేసు

వేములవాడరూరల్‌: తమ్ముడిపై అన్న దాడిచేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై మజీద్‌ తెలిపారు. సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్‌ మండలం బాలరాజుపల్లికి చెందిన నాగుల లక్ష్మణ్‌ ఆయన కుమారుడు రమేశ్‌ కలిసి తమ్ముడు నాగుల లక్ష్మణ్‌ను కొట్టారు. లక్ష్మణ్‌ ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మేడిపల్లి: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు భరించలేక వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారం మండలం కమ్మరిపేట గ్రామంలో జరిగింది. ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కమ్మరిపేటకు చెందిన గీతకార్మికుడు కోటగిరి రాజేందర్‌ గౌడ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాడు. పదేళ్ల నుంచి కడుపునొప్పితో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో జీవితంపై విరక్తితో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

మల్యాల: ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్‌ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నూకపల్లి డబుల్‌బెడ్‌రూంకు చెందిన గోనెపల్లి గంగాధర్‌(36) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం వేకువజామున ఆటో నడుపుకుంటూ జగిత్యాల వైపు వెళ్తుండగా, మల్యాల మండలం రాజారం శివారులో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు.

మృతదేహాన్ని అనుమతించని ఇంటి యజమాని

గోదావరిఖని: ద్వారకానగర్‌లో అద్దెఇంట్లో ఉంటున్న బాబుగౌడ్‌ తల్లి పద్మ గుండెపోటు తో శుక్రవారం రాత్రి మృతి చెందింది. అయి తే శవాన్ని ఇంట్లోకి తీసుకు వెళ్లగా.. యాజ మాని అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.

ఆర్టీసీ బస్సు, కారు ఢీ1
1/1

ఆర్టీసీ బస్సు, కారు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement