కేంద్ర మంత్రి పూజలు
మల్యాల(చొప్పదండి): మండలంలోని లంబాడిపల్లిలో శ్రీపద్మావతి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు మరాటి సత్తయ్య తెలిపారు. సర్పంచ్ మరాటి సంధ్యరాణి, నాయకులు పాల్గొన్నారు.
‘మదర్ కంగారు’లో అసౌకర్యాలు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మదర్ కంగారు విభాగంలో ఏర్పాటు చేసిన ఫీడింగ్ రూమ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. నవజాత శిశువుల సంరక్షణలో అత్యంత కీలకమైన ఎస్‌ఎన్‌సీయూ ఏర్పాటు చేసిన ఈ గదిలో మంచాలపై పరుపులు లేవు. బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీలింగ్ ఫ్యాన్లు ఉండగా, ఒకటి అసలే పనిచేయడం లేదు. వాష్ బేసిన్ ట్యాప్ నుంచి నీళ్లు రావడం లేదు. పరి శుభ్రత లోపిస్తోంది. అసౌకర్యాలు వెంటాడుతు న్నాయి. గంటల తరబడి అక్కడ గడపాల్సి వస్తున్న బాలింతలు.. అసౌకర్యంతో వేదన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
కేంద్ర మంత్రి పూజలు
కేంద్ర మంత్రి పూజలు


