చిత్రా మిశ్రా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

చిత్రా మిశ్రా బాధ్యతల స్వీకరణ

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

చిత్రా మిశ్రా బాధ్యతల స్వీకరణ

చిత్రా మిశ్రా బాధ్యతల స్వీకరణ

● ఆప్యాయతతో పలకరింపు ● కలెక్టరేట్‌ ప్రాంగణం పరిశీలన

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉద యం 10.30గంటలకు కలెక్టరేట్‌కు చేరుకోగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేరుగా కార్యాలయంలోకి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఆర్డీవో మహేశ్వర్‌ లు స్వాగతం పలకగా కలెక్టరేట్‌ ప్రధాన కా ర్యాలయ సూపరింటెండెంట్లను పరిచయం చేశారు. కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌, వివి ధశాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి పొన్నం ప్ర భాకర్‌ను కలెక్టర్‌ మర్యాదపూర్వకంగా కలిశా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శివకుమార్‌, సీపీ గౌస్‌ ఆలంలను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.

శుభాకాంక్షల వెల్లువ

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన చిత్రా మిశ్రాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శుక్రవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ కార్యాలయంలో ఆయా శాఖల జిల్లా అధికారులతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్‌, కార్యదర్శి డా.అడ్ల.అరవింద్‌ రెడ్డి, కోశాధికారి నాగరాజు, జాయింట్‌ సెక్రటరీ సుధాకర్‌, సాంస్కృతిక కార్యదర్శి రాజు నాయక్‌, క్రీడా కార్యదర్శి కొండల్‌ రెడ్డి తదితరులు పాల్గొనగా జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.లింగారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, సీపీవో వి.రాందత్తా రెడ్డి, డీఎస్వో నర్సింగరావు, ఎన్‌ఐసీ విభాగ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరాజన్న కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement