కరీంనగర్‌రూరల్: గోపాల్‌పూర్‌లోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వార్షికోత్సవా న్ని పురస్కరించుకొని బుధవారం కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకుడు చిగురాల మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో ఫలపంచామృతాలతో అభిషేకం, కలశ స్థాపన, హోమం, ప్రత్యేక పూజలు, గాయత్రి మూల మంత్రం హోమం జరిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, కార్పొరేటర్లు భూపతి రవీందర్, సాధవేని లావణ్య, సోమిడి వేణు తదితరులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లను సన్మానించారు. దేవాదాయ శాఖ నుంచి తాపాల లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో ధూపదీప నైవైద్యాలకు మంజూరు ఉత్తర్వులను తీసుకొచ్చినట్లు మేయర్ తెలిపారు.


