రోడ్డు కబ్జా వివాదం
రామచంద్రాపూర్‌కాలనీలో వివాదాస్పద స్థలం
ఆధారాలు చూపుతున్న మాజీ కార్పొరేటర్ రమణ
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రామచంద్రాపూర్ కాలనీలో రోడ్డు కబ్జా వివాదం కలకలం సృష్టిస్తోంది. కాలనీలో రోడ్డును కార్పొరేటర్ భర్త కబ్జా చేశారని, మాజీ కార్పొరేటర్ ఆరోపిస్తుండగా, అది తాము కొనుగోలు చేసిన స్థలమని కార్పొరేటర్ భర్త అంటున్నారు. నగరపాలకసంస్థ 12వ డివిజన్ రామచంద్రాపూర్‌కాలనీలోని సర్వే నెంబర్ 961/ ఏలో 188 గజాల స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త, బీజేపీ నాయకుడు చొప్పరి వేణు కబ్జా చేశాడని, మాజీ కార్పొరేటర్, బీఆర్‌ఎస్ నాయకుడు ఎ.వి.రమణ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశాడు. ఈ స్థలంలో డెడ్ ఎండ్ రోడ్డు ఉండగా, ఆ రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మించుకొన్నారని ఆరోపిస్తున్నాడు. కొంతమంది నగరపాలకసంస్థ అధికారులతో కుమ్మకై ్క అక్రమ నిర్మాణానికి ఇంటినంబర్ 8–3–286/ఏ తీసుకున్నాడంటున్నాడు. ఆ ఇంటి నంబర్ ఆధారంగా డాక్యుమెంట్ నం.243/2018 సృష్టించుకొని రూ.15 లక్షల రుణం పొందారని, చర్యలు తీసుకోవాలంటున్నాడు.
బండి సంజయ్ చర్యలు తీసుకోవాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ముందుగా తన చుట్టు ఉన్న అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని ఎ.వి.రమణ డిమాండ్ చేశాడు. శనివారం నగరంలో మాట్లాడుతూ రామచంద్రాపూర్ కాలనీలో రోడ్డును కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ భర్త చొప్పరి వేణు కబ్జాచేశాడని ఆరోపించాడు. రోడ్డు కబ్జా చేసిన కార్పొరేటర్‌తో రాజీనా మా చేయించి, పార్టీ నుంచి బర్త్‌రఫ్ చేసి నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు.
రోడ్డు కాదు...కొనుగోలు చేసిన స్థలమే...
రామచంద్రాపూర్‌కాలనీలోని స్థలం మేం గతంలో కొనుగోలు చేసిందే. అది రోడ్డు కాదు. పట్టేదారు నుంచి గతంలోనే మేం ఆ స్థలాన్ని కొనుగోలు చేశాం. రోడ్డును కబ్జా చేశామనడం సరికాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
– కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు
రోడ్డు కబ్జా వివాదం


