పరిశోధనాత్మక ఆలోచనలు ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పరిశోధనాత్మక ఆలోచనలు ఉండాలి

Mar 1 2026 7:35 AM | Updated on Mar 1 2026 7:35 AM

పరిశోధనాత్మక ఆలోచనలు ఉండాలి

పరిశోధనాత్మక ఆలోచనలు ఉండాలి

పరిశోధనాత్మక ఆలోచనలు ఉండాలి ● అదనపు కలెక్టర్‌, డీఈవో అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్‌ టౌన్‌: విద్యార్థులు పరిశోధనాత్మక ఆలో చనలతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్‌, డీఈవో అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. శని వారం సైన్స్‌ మ్యూజియంలో సీవీ రామన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో విజ్ఞానశాస్త్రం ఉపయోగాలను అవగాహ న చేసుకోవాలని సూచించారు. సర్‌ సీవీరామన్‌ కనుగొన్న రామన్‌ ప్రభావం గురించి వివరించి, దానికి గానూ ఆయన నోబెల్‌ బహుమతి అందుకున్నారని తెలియజేశారు. జిల్లా సైన్స్‌ అధికారి జయపాల్‌ రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దన్గర్వాడి స్కూల్‌ సందర్శన

పీఎంశ్రీ దన్గర్‌వాడీ పాఠశాలను అడిషనల్‌ కలెక్టర్‌, డీఈవో అశ్వినీ తానాజీ వాకడే ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల, విద్యార్థులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యసనస్థాయిని పరీక్షించారు. ఏఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయం తెలుసుకున్నారు. పలు వురు విద్యార్థులకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని సిబ్బందిని తీవ్రంగా మందలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement