చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన ఉండాలి

Mar 1 2026 7:35 AM | Updated on Mar 1 2026 7:35 AM

చట్టా

చట్టాలపై అవగాహన ఉండాలి

జూట్‌ ఉత్పత్తులతో ఊతం వైద్యులపై దాడులు సరికాదు సిటీలో పవర్‌కట్‌

ఇల్లందకుంట: విద్యార్థులు చట్టాలపై అవగా హన కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌కుమార్‌ సూచించారు. శనివారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సైన్స్‌ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను తిలకించి, అభినందించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులకు పా ల్పడితే పొక్సో చట్టం ద్వారా శిక్షించబడతారని, పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులు చట్టపరమైన అంశాలను తెలుసుకోవాలన్నారు. సెకండ్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.వీణప్రణతి, ఎస్సై క్రాంతికుమార్‌, తహసీల్దార్‌ బి.భాస్కర్‌, సర్పంచ్‌ దార సురేశ్‌, ప్రధానోపాధ్యాయురాలు తస్మిన్‌ నజ్మీన్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌: జూట్‌ ఉత్పత్తుల ప్రోత్సాహం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభి స్తుందని జిల్లా పరిషత్‌ సీఈవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. భారత ప్రభుత్వ టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ జూట్‌ బోర్డు ప్రారంభించిన జూట్‌ మార్క్‌ ఇండియా (జెఎంఐ) పథకంపై అవగాహన కల్పించేందుకు టెక్స్‌టైల్‌ కమిటీ నిర్వహణలో శనివారం కరీంనగర్‌లోని మైత్రి హోటల్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించారు. జెడ్పీ సీఈవో మాట్లాడుతూ జూట్‌ ఫైబ ర్‌ ప్రాముఖ్యతను, జనపనార సాంప్రదాయ, విభిన్న ఉత్పత్తుల ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని జూట్‌ మార్క్‌ ఇండియా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదనపు డీఆర్‌డీవో రవి కుమార్‌, డీపీఎం వేణుగోపాల్‌, మహిళా ప్రాంగణం డీఎం సుధా రాణి, టెక్స్‌టైల్స్‌ కమిటీ జాయింట్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.మురళీధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ బిస్వనాథ్‌బన్సాలీ, కె.శిరీష, సి. సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌: వైద్యులు ఉన్నది ప్రాణాలు కాపాడేందుకేనని, ప్రాణాలు తీయాలని ఏ వైద్యుడికి ఉండదని కరీంనగర్‌ ఐఎంఏ, తానా వైద్యులు అన్నారు. వైద్య వృత్తిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో శనివారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సీనియర్‌ పీడియాట్రీషియన్‌పై దాడి జరిగిన ఘటనను హేయమైన చర్యగా అభివర్ణిస్తూ, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీపీ గౌస్‌ ఆలంకు వినతిపత్రం అందజేశారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ కఠారి, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ఎనమల నరేశ్‌, ఎన్‌.మహేష్‌ బాబు, నీ లిమ కాసం, విజయేంద్రరెడ్డి, బీఎన్‌.రావు, సు రేశ్‌కుమార్‌, రాజకుమార్‌, స్రవంతి, స్వప్న, రామ్‌మోహన్‌, రఘునాథ్‌, శ్రీలత పాల్గొన్నారు.

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనులు నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.గంజ్‌ ఫీడర్‌ పరిధిలోని మార్కెట్‌, సిక్‌వాడీ, కల్పన హోట ల్‌, బోయవాడ, గంజ్‌ ప్రాంతాలు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.వావిలాలపల్లి ఫీడర్‌ పరిధిలోని వావిలాలపల్లి ప్రాంతాలతో పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.గీతాభవన్‌ ఫీడర్‌ పరిధిలోని రాజీవ్‌పార్కు, మంకమ్మతోట, మార్క్‌ఫెడ్‌ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈలు తెలిపారు.

చట్టాలపై అవగాహన    ఉండాలి1
1/2

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన    ఉండాలి2
2/2

చట్టాలపై అవగాహన ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement