కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తిపన్ను మొండి బకాయిదారులపై అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, నగరంలో ఆస్తిపన్నుల వసూళ్లను వేగవంతం చేయడం తెలిసిందే. వందశాతం పన్నులు వసూలు లక్ష్యానికి అడ్డుగా ఉన్న మొండిబకాయిదారులపై కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గురువారం నగరంలో పన్నులు వసూలు కొనసాగించారు. గతంలో నోటీసు ఇచ్చి గడువు ముగిసినా చెల్లించని ఎనిమిది షాప్‌లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టాప్‌లో ఉన్న వందమంది మొండిబకాయిదారులకు రెడ్‌నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. గడువులోగా బకాయిలు చెల్లించని దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు కూడా నోటీసులు ఇవ్వాలని అన్నారు. మొండిబకాయిదారులు లక్ష్యంగా అధికార బృందాలు పన్నులు వసూళ్లు చేయాలని సూ చించారు.


